HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!

మేడ్చల్‌లో ఇటీవల ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దొంగలు కేవలం 40 సెకన్లలోనే నగదు, నగలను చోరీ చేశారని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!

శేరిలింగంపల్లి, మన సాక్షి :

మేడ్చల్‌లో ఇటీవల ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దొంగలు కేవలం 40 సెకన్లలోనే నగదు, నగలను చోరీ చేశారని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు.

శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 20న మేడ్చల్‌లోని శ్రీ జగదాంబ జ్యువెల్లర్స్ దుకాణంలోకి బురఖా వేసుకొని ఒకరు… హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారని తెలిపారు. వారు నలభై సెకన్లలోనే దోపిడీ చేశారన్నారు. మూడుసార్లు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు.నిందితులు పారిపోవడంతో 200 సీసీ కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు.

కిలో మీటరు దూరంలో బైక్ పెట్టి వారు పరారయ్యారని పేర్కొన్నారు. వారు ఓయూ, హబ్సిగూడలో బైక్‌లను దొంగిలించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి 16 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులను నజీం, సోహైల్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన చోరీలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామన్నారు.

ALSO READ : 

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!