District Collector : వైద్యం సక్రమంగా అందుతుందా..? మందు అందిస్తున్నారా.? ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్..!
శనివారం కలెక్టర్ బి, చంద్రశేఖర్ పట్టణంలోని ప్రధాని ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు.

District Collector : వైద్యం సక్రమంగా అందుతుందా..? మందు అందిస్తున్నారా.? ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్..!
నల్లగొండ, మన సాక్షి
శనివారం కలెక్టర్ బి, చంద్రశేఖర్ పట్టణంలోని ప్రధాని ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. మొదట సూపరింటీండెంట్ కార్యాలయంలో హాజరు రిజిస్టర్లను పరిశీలించిన కలెక్టర్, అనంతరం వెల్‌నెస్ సెంటర్‌ను సందర్శించారు.
అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వైద్యం సక్రమంగా అందుతోందా? అవసరమైన మందులు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. కొన్ని మందులు అందుబాటులో లేవని రోగులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వాటి సరఫరా పరిస్థితిని తెలుసుకుని, అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో త్వరలో ప్రారంభించనున్న డి-అడిక్షన్ సెంటర్‌ను కూడా పరిశీలించిన కలెక్టర్, మాదకద్రవ్యాల వ్యసనానికి గురైన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. రోగుల అవసరాలకు అనుగుణంగా విభాగాలను వేర్వేరుగా ఏర్పాటు చేసి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎంసీహెచ్ (మాతా శిశు ఆరోగ్య) వార్డును సందర్శించిన కలెక్టర్, గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, సిబ్బంది తమను బాగా చూసుకుంటున్నారని వారు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆశా కార్యకర్తలను వారి గర్భిణీ స్త్రీలను తీసుకువచ్చారు. స్వస్థలాల గురించి అడిగి తెలుసుకున్నారు. మునుగోడు ప్రాంతం నుంచి వచ్చామని వారు చెప్పగా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఫార్మసీ విభాగాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్, మందుల నిల్వలు, పంపిణీ విధానంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిసూపరింటెండెంట్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్యం అందేలా చూడాలని, విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వవద్దని స్పష్టం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఆసుపత్రి సూపరింటిండెంట్ నేత నరసింహారావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్లు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.










