Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లాహైదరాబాద్

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

Free Coaching : సివిల్స్ లాంగ్ టర్మ్ ఉచిత శిక్షణ.. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ వారి నుంచి దరఖాస్తులకు ఆహ్వానం..!

పెద్దపల్లి ధర్మారం, ( ప్రతినిధి)

సివిల్స్ సర్వీసెస్ లాంగ్ టర్మ్-2025 (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) పరీక్షా కొరకు ఉచిత శిక్షణకు జూలై 3 లోగా దరఖాస్తు సమర్పించాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రంగారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ , ఈబీసీ పెద్దపల్లి జిల్లా అభ్యర్థులు సివిల్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం జులై 3 లోపు వెబ్ సైట్ www.tgbcstudycircle.cgg.gov.in నందు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కోచింగ్ తరగతులు 2024 జూలై 18 నుండి 2025 ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయని, మొత్తం 150 మంది అభ్యర్థులకు కోచింగ్ ఇవ్వనుండగా, అందులో 100 మందికి గాను జులై 7న నిర్వహించే ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేస్తారని తెలిపారు.

మరో 50 మంది అభ్యర్థులను ఇంతకు ముందు యూపిఎస్సీ ద్వారా నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారిని నేరుగా తీసుకొనబడతారని, వారు సంబంధిత పత్రాలతో జూలై 3 లోగా టి.జీ.బీ.సీ. స్టడీ సర్కిల్, లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్, హైదరాబాద్ 500059 నందు దరఖాస్తును సమర్పించాలని సూచించారు.

ప్రవేశం పొందిన అభ్యర్థులకు లాడ్జింగ్ భోజన, రవాణా ప్రయోజనం కోసం నెలకు ఐదు వేలు, బుక్ ఫండ్ నిమిత్తము ఐదు వేల రూపాయలను ఒక్కసారి ఇవ్వబడ తాయని, గ్రంథాలయ సదుపాయం కూడా కల్పించినట్లు తెలిపారు. ఈ ఉచిత శిక్షణ హైదరాబాదులో ఉంటుందని, అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని రంగారెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

ALSO READ : 

Telangana : తెలంగాణ మంత్రివర్గం విస్తరణకు కసరత్తు.. రాజగోపాల్ రెడ్డికి చోటు..?

Jobs : పదవ తరగతి మార్కులతో ఉద్యోగాలు.. మీరూ దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు