Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!

బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉధృక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే.

Cm Revanth: పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం..!

హైదరాబాద్, మన సాక్షి :

బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఉధృక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉన్న సమయంలోనే ఎమ్మెల్యేను కలిసేందుకు బీఆర్ఎస్ నాయకులు పోచారం ఇంటికి వచ్చారు.

ఇంటికి వచ్చిన వాళ్లలో బాల్క సుమన్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. వారు నేరుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళుతుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం:

మాజీ స్పీకర్ , బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

ALSO READ : 

BIG BREAKING : పోచారంతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం..!

నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి, మర్మాంగాలపై కారంచల్లి దారుణం..!