నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి, మర్మాంగాలపై కారంచల్లి దారుణం..!

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి జరిగింది. పనికి రావట్లేదని ఆమె మర్మాంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించారు.

నాగర్ కర్నూలు జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి, మర్మాంగాలపై కారంచల్లి దారుణం..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై పాశవిక దాడి జరిగింది. పనికి రావట్లేదని ఆమె మర్మాంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మలచింతలపల్లి గ్రామంలో బాధితురాలు చెంచు మహిళా ఈశ్వరమ్మ భర్త ఈదన్న తమ వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చారు. ఆ భూమిలో వెంకటేష్ ఫిల్టర్ ఇసుక తయారీ కేంద్రం పెట్టుకోగా వారు అతని వద్దనే పనిచేస్తున్నారు.

ఒకరోజు భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ఈశ్వరమ్మ పుట్టింటికి వెళ్ళింది. కాగా ఈశ్వరమ్మ పనికి రావట్లేదని యజమాని వెంకటేష్ పుట్టింటి నుండి తీసుకొచ్చి తన దగ్గర గదిలో బంధించి పాసవికంగా దాడి చేశాడు. ఈశ్వరమ్మ మర్మాంగాలపై, కళ్ళలో కారం చల్లి డీజిల్ పోసి విప్పండించి కర్రలతో తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో ఈశ్వరమ్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ALSO READ : 

Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!

Nithish Kumar Reddy: జాక్ పాట్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాలో చోటు..!