Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణ

Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!

Mission Bhagiratha : ప్రత్యేక యాప్ లో మిషన్ భగీరథ వివరాల నమోదు, గ్రామాలలో ప్రత్యేక సర్వే..!

కంగ్టి, మన సాక్షి :

గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీటికి సరఫరా చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేసేందుకు రూ. వేల పోట్లు వెశించిన మేరా మిషన్ భగీరథ నీరు సరఫరా కాలేదు, పూర్తికాని పైప్ లైన్లు కారణంగా కొన్నిచోట్ల పైప్ లైన్ లో లీకేజీలతో మరి కొన్నిచోట్ల అంతరాయం కల్గుతోంది. తాజాగా ప్రభుత్వం ఆదేశాలతో శత్రుస్థాయిలో పథకం అమ లు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు.

వివరాల నమోదు యాప్ 

త్రాగునీటి సరఫరా ఎలా ఉంది. అనే అంశంపై కంగ్టి మండల వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తున్నారు. సర్వేలో భాగంగా గ్రామాల్లో పైప్ లైన్లు సక్రమంగా ఉన్నాయా, ట్యాంకుల ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు చేరుతోదా, ఎన్ని ఇళ్లకు నీటి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. అన్న అంశంపై అరా తీస్తున్నారు. సేకరించిన వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్ లో నమోదు చేస్తున్నారు.

సరఫరా మెరుగే లక్ష్యంగా 

కంగ్టి మండలంలో 34 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 100 లీటర్ల చొప్పున ప్రతి ఇంటికి నిత్యం 400 లీటర్ల నీటిని పంపిణీ చేయాల్సింది. మిషన్ భగీరథ లక్ష్యం క్షేత్రస్థాయిలో అమల్లోని లోపాలు కొత్త ప్రభుత్వం దృష్టి రావడంతో సర్వేకు ఆదేశించారు. సర్వే నివేదిక ఆధారంగా త్రాగునీటి సరఫరా మెరుగుకు కార్యచరణ రూపొందించనున్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తామని ఎంపీడీవో సత్తయ్య తెలిపారు.

ALSO READ : 

Nithish Kumar Reddy: జాక్ పాట్ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి.. టీమిండియాలో చోటు..!

Nalgonda : ఆపదతో ఆసుపత్రికి వస్తే డబ్బులు అడుగుతారా..? ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు