Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఖమ్మం జిల్లాజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

BIG ALERT: వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు కట్.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..!

మన సాక్షి :

రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ లపై తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వాటితో పాటు రైతుల రుణ మాఫీ పై కూడా ఆయన సంచలన కామెంట్స్ చేశారు. రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ లపై ఆయన చేసిన కామెంట్స్ సంచలనం కలిగించాయి.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే కొన్ని గ్యారెంటీలు అమలు చేయగా మరికొన్ని గ్యారెంటీ హామీలను కూడా అమలు చేయనున్నది. కాగా ఇటీవలనే రైతుల రుణమాఫీ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏక కాలంలో చేయాలని నిర్ణయించింది.

ఇది ఇలా ఉండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం లో జరిగిన సమావేశంలో మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో చాలామంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఇకపై ఆనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని పేర్కొన్నారు. అర్హులైన వారికందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు అందజేస్తామని తెలిపారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒకే విడతలో రైతుల రుణమాఫీని 2 లక్షల రూపాయల వరకు చేస్తుందని ప్రకటించారు. జూలై నెల నుంచి రుణమాఫీ ప్రక్రియ పరారంభం అవుతుంది అని వెల్లడించారు.

రుణమాఫీ పై క్యాబినెట్ ఆమోదం తెలిపిందని, గత ప్రభుత్వం అనర్హులకు కూడా రుణమాఫీ చేసిందని, తాము మాత్రం అర్హులను గుర్తించి వారికి మాత్రమే రుణమాఫీ చేస్తామన్నారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదని త్వరలోనే లబ్ధిదారులను గుర్తించి అర్హులైన వారికి స్థలాలను కూడా అందిస్తామని వెల్లడించారు.

ALSO READ : 

POSTAL: పోస్టల్ శాఖలో 50వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండా ఎంపిక..!

HYDERABAD : సంచలనం కలిగించిన బురఖా దొంగలు..కేసు ఛేదించిన సైబరాబాద్ పోలీసులు..!

Nalgonda : ఒక్క ఫోన్ కాల్ చాలు.. కోమటిరెడ్డి మార్క్..!

మరిన్ని వార్తలు