స్మశాన వాటికను వదలట్లేదు.. రియల్ వ్యాపారుల చెర నుంచి కాపాడాలని గ్రామస్తుల ధర్నా..!
స్మశాన వాటికను వదలట్లేదు.. రియల్ వ్యాపారుల చెర నుంచి కాపాడాలని గ్రామస్తుల ధర్నా..!
శంకర్‌పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండల పరిధిలోని ఎల్వర్తి అనుబంధ గ్రామమైన కొజ్జ గూడెం గ్రామంలో స్మశాన వాటికను కొనుగోలు చేశానని ఓ వ్యక్తి కంచ వేస్తున్నాడు. దాంతో గ్రామస్తులు ఆగ్రహించి ధర్నాకు దిగారు. వివరాల ప్రకారం.. ఆ గ్రామంలోని సర్వేనెంబర్ 85 లో ఒక ఎకరా 16 గుంటల భూమిలో 150 సంవత్సరాలుగా 30 దళిత కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అదే సర్వే నెంబర్ లో గ్రామానికి చెందిన అన్ని కులాల వారు స్మశానవాటికను ఏర్పాటు చేసుకున్నారు.
అదే విధంగా సర్వేనెంబర్ 81 లో 24 గంటల భూమిలో రెండు దేవాలయాలు, అంగన్వాడి కేంద్రము, ప్రభుత్వ పాఠశాల కూడా ఉన్నాయి. సర్వే నెంబర్ 85 మరియు 87 లలో కాస్రా పహాని కాలం నుండి రికార్డుల్లో బొందలగడ్డగా మరియు గృహాలుగా రికార్డులో ఉంది. గ్రామానికి చెందిన ఒక వ్యక్తి సదరు ఈ భూమిని నేను కొనుగోలు చేసుకున్నానని, సిమెంట్ కడ్డీలు వేయడానికి ప్రయత్నం చేశాడు.
ALSO READ : Good News : తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్.. ఈ పథకానికి లక్షల్లో ఆర్థిక సహాయం..!
గ్రామంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాలని గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామ ప్రజలు గతంలో పలుమార్లు తహసిల్దార్ కు విన్నవించుకున్నారు. అయినప్పటికీ ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని నానా హంగామా చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి ఉన్న బొందల గడ్డను కాపాడాలని గ్రామానికి చెందిన గ్రామస్తులు పెద్ద ఎత్తున శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.
ఆ తదనంతరం శంకర్‌పల్లి ప్రధాన కూడలిలో నిరసనను వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు తరతరాలుగా గ్రామానికి ఉన్న బొందల గడ్డను కాపాడాలని రియల్ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామానికి చెందిన గుడి, బడి, బొందల గడ్డ అన్ని కబ్జా చేస్తూ ఉంటే మాకు పాలు పోలేని పరిస్థితి ఏర్పడుతుందని, అధికారులు ఈ విషయంలో వేగంగా స్పందించాలని వారు కోరుతున్న పరిస్థితి నెలకొంది.
ఇది కూడా చదవండి:
Viral : ప్రధానోపాధ్యాయుడికి ప్రేమ జ్వరం.. టీచర్ ని పైకి లేపి మరీ అలా.. (వీడియో వైరల్)
Ktr, Somireddy : మీ కళ్ళకున్న పొరలు ఇంకా తొలగనట్టుంది.. కేటీఆర్ పై సోమిరెడ్డి ఫైర్..!









