శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో, సాగర్ ఆయకట్టులో ఆశలు..!
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం.. ఆల్మట్టికి ఇన్ ఫ్లో,
సాగర్ ఆయకట్టులో ఆశలు..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. విద్యుత్ ప్లాంట్ నుంచి నాగార్జున సాగర్ కు నీరు విడుదల అవుతుంది. నాగార్జున సాగర్ నీటి అవసరాల నిమిత్తం మూడు టీఎంసీల నీటిని సాగర్ అధికారులు కోరారు. దాంతో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తితోపాటు సాగర్ కు మూడు టిఎంసిల నీటిని విడుదల చేసే క్రమంలో దీనిని ప్రారంభించారు.
శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అందుకుగాను 15,919 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో ఇంకా ఏమీ రావడం లేదు. విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో ఔట్ ఫ్లో 15 వేల 919 క్యూసెక్కులుగా ఉంది.
ALSO READ : TGSRTC : ప్రయాణికులకు TGSRTC మరో గుడ్ న్యూస్.. ఆ ప్రాంతాలకు ఏసీ బస్సులు..!
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 812.80 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నీటి విలువ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 35.9850 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు మరింత నీరు చేరితే ఎడమ గట్టు ద్వారా కూడా జల విద్యుత్తును ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగితే సాగర్ ప్రాజెక్టు లోకి అవసరాల మేరకు మీరు చేరే అవకాశం ఉంది.
ఆల్మట్టి డ్యాంకు కొనసాగుతున్న వరద :
కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంకు వరద కొనసాగుతుంది. సోమవారం సాయంత్రం నాటికి 45వేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 95.22 టీఎంసీలకు నిలువలు చేరుకున్నాయి. దాంతో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్ ప్రాజెక్టుకు 97 .30 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వరద నీరు ఇలాగే మరో రెండు రోజులపాటు కొనసాగితే ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తి నారాయణపూర్ కు నీటిని విడుదల చేయగానే నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు కూడా అదే రోజు ఎత్తనున్నారు.
ALSO READ : Good News : సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వారికి రూ.5 లక్షలు సహాయం..!
ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల వివరాలు :
ఆల్మట్టి ఆనకట్ట:
స్థానం: బాగల్కోట్ జిల్లా, కృష్ణా నది
ప్రస్తుత నిల్వ: 18,349.501 M.Cft (గరిష్ట సామర్థ్యం)
పూర్తి జలాశయ స్థాయి (Mt): 519.60
ప్రస్తుత స్థాయి: 517.56 Mt
ఇన్ ఫ్లో: (+)45123 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 9,730 క్యూసెక్కులు
ఫంక్షన్: ప్రధానంగా నీటిపారుదల కొరకు నిర్మించబడిన ఆల్మట్టి ఆనకట్ట జలవిద్యుత్ ఉత్పత్తి మరియు వరద నియంత్రణకు కూడా మద్దతు ఇస్తుంది, ప్రాంతీయ వ్యవసాయం మరియు నీటి భద్రతకు గణనీయంగా తోడ్పడుతుంది.
నారాయణపుర్ ఆనకట్ట:
స్థానం: యాద్గిర్ జిల్లా, కృష్ణా నది
పూర్తి జలాశయ స్థాయి (Mt): 492.25
ప్రస్తుత స్థాయి: 489.65 Mt
ఇన్ ఫ్లో: (+)10404.26 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 92.01 క్యూసెక్కులు
బసవ సాగర్ డ్యామ్, గతంలో నారాయణపుర్ ఆనకట్టగా పిలువబడింది, ఇది కర్ణాటకలోని యాద్గిర్ జిల్లాలో కృష్ణా నదిపై నిర్మించబడింది.
ఇది సృష్టించే రిజర్వాయర్, బసవ సాగర్, మొత్తం నిల్వ సామర్థ్యం 37.965 TMCFT (1.075 km³).
ఇవి కూడా చదవండి :
Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!
Cm Revanth Reddy : రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్.. లేటెస్ట్ అప్డేట్..!









