Cm Revanth Reddy : రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్.. లేటెస్ట్ అప్డేట్..!
Cm Revanth Reddy : రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ట్వీట్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ పై మార్గదర్శకాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 15వ తేదీలోగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా రుణమాఫీ మార్గదర్శకాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో రేవంత్ రెడ్డి తన ఎక్స్ వేదికగా స్పందించారు. రైతు రుణమాఫీ పథకంపై ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్న అంశం ఇది.
అన్నం పెట్టే రైతులను అప్పుల ఊబి నుండి ఆశల సాగు వైపు నడిపించేందుకే రైతు రుణమాఫీ పథకం అని పేర్కొన్నారు. ఎంత కష్టమైనా.. ఎంత భారమైనా.. ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత నాడు ప్రధానిగా మన్మోహన్ సింగ్ సారధ్యంలో దేశవ్యాప్తంగా జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో భాగంగా తొలి అడుగు విధి విధానాలు ఖరారు చేసినట్లు రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు
అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి…
ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే…
ఒక బృహత్తర సాహసం…
“రైతు రుణమాఫీ పథకం”నాడు శ్రీ మన్మోహన్ సింగ్ సారథ్యంలో
దేశ రైతాంగానికైనా…
నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో
రాష్ట్ర రైతాంగానికైనా…
ఎంత కష్టమైనా…
ఎంత భారమైనా…
ఏకకాలంలో రుణమాఫీ…
చేసిన……— Revanth Reddy (@revanth_anumula) July 16, 2024
ఇవి కూడా చదవండి :
Runamafi : రుణమాఫీ పై ప్రభుత్వం ట్విస్ట్.. అందరికీ కాదు, ఇవీ మార్గదర్శకాలు..!
మిర్యాలగూడ : 35 ఏళ్లగా నడుస్తున్న దారిని మూసేశారు.. దారిలో ముళ్ల కంపలు, చుట్టూపంట పొలాలు..!









