సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు.. సాగుకు సిద్ధమైన రైతాంగం..!
సాగర్ ఆయకట్టులో ఎదురుచూపులు.. సాగుకు సిద్ధమైన రైతాంగం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
నాగార్జునసాగర్ ఆయకట్టులో రైతాంగం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. వానకాలం పంటల సాగుకు రైతాంగం సిద్ధమయ్యారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులన్ని నిండుకుండలా.. మారాయి.
సాగర్ ఎగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 885 అడుగుల నీటి సామర్థ్యంకు గాను ప్రస్తుతం 846 అడుగుల నీరు చేరింది. ఇంకా శ్రీశైలం ప్రాజెక్టుకు లక్ష 50 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నిండడంతో మరికొద్ది రోజులపాటు శ్రీశైలం కు వరద నీరు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కూడా నిలిపివేశారు. దిగువకు నీటిని విడుదల చేయడం లేదు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీ లోనే ఉంది. కానీ శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండుతుందని ఆశలు సాగర్ ఆయకట్టు రైతాంగంలో ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిండితే సాగర్ జలాశయానికి మీరు వస్తుందని ఎదురుచూస్తున్నారు.
గత ఏడాది సాగర్ ఆయకట్టు ప్రాంతంలో సాగునీటికి విడుదల చేయకపోవడం వల్ల పంట పొలాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీరు లేకపోయినప్పటికీ సాగునీరు విడుదలవుతుందని ఆశతో వరి నార్లు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు.
ఆల్మట్టికి కొనసాగుతున్న ఇన్ కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాంకు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. లక్ష 15 వేల క్యూసెక్కుల వరద నీరు ఆల్మట్టి డ్యాంకు చేరుతుండగా 1,50,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదేవిధంగా మరికొద్ది రోజులపాటు ఆల్మట్టికి వరద నీరు చేరితే తమ ఆశలు పదిలంగా ఉంటాయని సాగర్ ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Srishailam : శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి, మరో రెండు రోజులు ఇదే పరిస్థితి..!
BREAKING : ఉప్పొంగిన గోదావరి.. భద్రాచలం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ..!










