Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 4.19 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఆప్రమత్తం..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 4.19 లక్షల క్యూసెక్కుల వరద.. గేట్లు ఎత్తేందుకు అధికారులు ఆప్రమత్తం..!
మన సాక్షి, నాగార్జునసాగర్ :
కృష్ణా నదిపై నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కృష్ణా నది ఎగువ భాగంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండడంతో దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి 5,16,501 క్యూసెక్కుల అవుట్ ఫ్లో కొనసాగుతుంది. జలాశయానికి 4,54,710 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశ నీటిమట్టం 885 అడుగులకు గాను 883.80 అడుగుల మేర నీటిమట్ట ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టిఎంసిలకుగాను 204 టీఎంసీల నీరు ఉన్నది. దిగువకు 5,16,501 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
సాగర్ కు భారీ వరద :
నాగార్జునసాగర్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 4,19,588 క్యూసెక్కుల వరద నీరు సాగర్ కు చేరుతుంది. 34,088 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లో కొనసాగుతుంది. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 590 అడుగుల నీటి సామర్థ్యం గాను 561.40 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 232 టీఎంసీల నీటికి చేరింది.
వరద నీరు ఇదే విధంగా మరో రెండు, మూడు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. దాంతో నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి ఎందుకు అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విధంగా వరద నీరు కొనసాగితే సోమవారం సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
మిర్యాలగూడ : ఉపాధ్యాయుల 15ఏళ్ళ కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..!
DEVARAKONDA : ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి..!
Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!









