Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

మిర్యాలగూడ : ఉపాధ్యాయుల 15ఏళ్ళ కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

మిర్యాలగూడ : ఉపాధ్యాయుల 15ఏళ్ళ కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

ఉపాధ్యాయుల 15 ఏళ్ల కలను కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చిందని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం హైదారాబాద్ ఎల్ బి స్టేడియం నందు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న సమావేశానికి బయలుదేరిన మిర్యాలగూడ ఉపాధ్యాయుల వాహనాలను మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే వారికి మేలు జరుగుతుంది అని భావించారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి గత 10 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయాన్ని , వారు ఎదుర్కున్న ఇబ్బందులను గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30 వేల మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ ఇచ్చి వారికి అండగా నిలిచారన్నారు.

ప్రభుత్వ విద్యా వ్యవస్థను మెరుగు పరచాలంటే ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం, కావున వారికి అన్ని సౌకర్యాలు కల్పించాలని, వారికి అండగా నిల్చుంటే వారి బాధ్యతలు కూడా సక్రమంగా నిర్వర్తిస్తారు అని అన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా ఉపాధ్యాయులు ప్రమోషన్స్ కోసం ఎన్నో సార్లు ప్రభుత్వానికి విన్నపించుకున్నా.. గత ప్రభుత్వం చలించలేదని, చివరిగా 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పదోన్నతులు ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఉపాధ్యాయులకు న్యాయం చేసారని అన్నారు.

ALSO READ : 

Nagarjunasagar : సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త.. ఎడమ కాలువకు నీటి విడుదల..!

DEVARAKONDA : ఎస్ఎల్బీసీ, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలి..!

Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update

మరిన్ని వార్తలు