క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Nalgonda : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య..!
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉలివేసుకుని బాలింత ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది.

Nalgonda : నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం.. ఉరివేసుకొని బాలింత ఆత్మహత్య..!
మన సాక్షి, నల్గొండ ప్రతినిధి :
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఉలివేసుకుని బాలింత ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27)గా మృతురాలిని గుర్తించారు. ఆమె వారం రోజుల క్రితం బాలికకు జన్మనిచ్చింది.
బుధవారం తెల్లవారుజామున ఆసుపత్రి వార్డు నుంచి ఆమె బయటకు వెళ్లి పోస్టుమార్టం గది సమీపంలో ఉన్న చెట్టుకు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో మమతకు ముగ్గురు ఆడపిల్లలు కాగా నాలుగవ కాన్పు కూడా ఆడపిల్ల పుట్టింది. దాంతో కుటుంబంలో వేధింపులే ఆమె ఆత్మహత్య కు కారణమై ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.









