Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలు

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. నాలుగు ట్రాక్టర్ల పట్టివేత..! 

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు.

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. నాలుగు ట్రాక్టర్ల పట్టివేత..! 

కరీంనగర్ బ్యూరో, మనసాక్షి :

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను కరీంనగర్ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు సంబంధిత యజమానులు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్‌ ఎన్. నిరంజన్‌రెడ్డి తెలిపారు. రూరల్‌ ఎస్సై ఎ. లక్ష్మారెడ్డి సిబ్బందితో కలిసి సోమవారం మండల పరిధిలో పెట్రోలింగ్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా సుల్తానాబాద్‌ మండలం గొల్లపల్లి వాగు నుంచి అనుమతులు లేకుండా కరీంనగర్‌ వైపు ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ముగ్దుంపూర్‌ వద్ద ఒక ట్రాక్టర్‌, దుర్షేడు వద్ద రెండు ట్రాక్టర్లు, లారీ అసోసియేషన్‌ సమీపంలో మరో ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. పట్టుబడిన వాహనాలను పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత యజమానులు, డ్రైవర్లను అదుపులోకి తీసుకుని కరీంనగర్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కేసులు నమోదు చేసి తదుపరి చర్యల నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న వారిపై కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ వద్ద బైండోవర్‌ చర్యలు చేపట్టనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా, అక్రమ విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే రౌడీషీట్‌ కూడా తెరుస్తామని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు