Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsతెలంగాణ

BIG BREAKING : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి ఎప్పటికప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. అందులో భాగంగా సోమవారం బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

BIG BREAKING : మన సాక్షి బ్రేకింగ్ న్యూస్..!

మన సాక్షి వెబ్ డెస్క్ :

మన సాక్షి ఎప్పటికప్పుడు మీకు బ్రేకింగ్ న్యూస్ అందిస్తుంది. అందులో భాగంగా సోమవారం బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి :

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు మృతి చెందారు. హనుమకొండ రోడ్డులో కళ్యాణమస్తు షాపింగ్ మాల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న మున్సిపల్ చెత్త సేకరణ ట్రాక్టర్ను వెనుక నుండి బైక్ ఢీ కొట్టింది. బైక్ పై ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. కాగా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో హుస్నాబాద్ కు చెందిన శ్రీకాంత్, నరసింహ గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లి.. తెల్లారేసరికి బావిలో మృతదేహంగా :

బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం గణపవరానికి చెందిన ఈశ్వరమ్మ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అనంతరం ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.

రాత్రి 12 గంటల వరకు ఆమె కోసం వెతికిన ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం తెల్లవారుజామున రోడ్డు పక్కన ఉన్న బావిలో ఈశ్వరమ్మ మృతదేహం ఉన్నట్లుగా స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు