పోక్సో కేసులో ప్రైవేట్ ఆసుపత్రి ఎండీ రిమాండ్..!
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరేడ్మెట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

పోక్సో కేసులో ప్రైవేట్ ఆసుపత్రి ఎండీ రిమాండ్..!
మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేరేడ్మెట్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
నేరేడ్ మెట్ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడ్మెట్ పరిధిలోని సంతోషిమా నగర్లో ఉన్న శ్రీసాయి శ్రీనివాస మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఓ బాలిక ట్రైనీ నర్సుగా చేరింది. కొంతకాలంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ ధరావత్ తార్యా నాయక్ తనను లైంగికంగా వేధిస్తున్నట్లు బాలిక తన తల్లికి తెలిపినట్లు పేర్కొన్నారు.
తన కుమార్తె చెప్పిన విషయాలను తెలుసుకున్న తల్లి నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి బాలిక నుంచి వివరాలను సేకరించి, ఘటనకు సంబంధించిన అంశాలపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఫిర్యాదు అనంతరం కేసును దర్యాప్తు చేసిన సోమవారం నిందితుడు ధరావత్ తార్యా నాయక్‌ను అదుపులోకి తీసుకుని అనంతరం న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటయ్య వెల్లడించారు.









