Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి, మరో ప్రమాదంలో ఇద్దరు మృతి..!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు కూలీలు మృతి, మరో ప్రమాదంలో ఇద్దరు మృతి..!

మన సాక్షి, జాహిరాబాద్ :

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల పరిధిలో మంగళవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. సత్వర్ గ్రామం సమీపంలో వేగంగా వచ్చిన ట్యాంకర్ కూలీలు వెళుతున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదం దాటికి ఆటో నుజు నుజ్జు కాగా ఘటన స్థలంలోనే ఏడుగురు కూలీలు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయాలైన వారిలో కూడా ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతి చెందిన వారంతా కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ప్రతిరోజు మాదిరిగానే కూలీలు జహీరాబాద్ ప్రాంతానికి వ్యవసాయ పనుల కోసం వచ్చి పనులు ముగించుకొని తిరిగి వెళుతుండగా ఆటో ప్రమాదం చోటుచేసుకుంది.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి :

అదే హైవేపై ఆటో ప్రమాదం కలకలం జరగగా.. మరో ఘోర ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన మూడు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే రహదారిపై స్వల్ప వ్యవధిలోని 9 మంది మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర విషాదంలో నెలకొన్నది.

మరిన్ని వార్తలు