Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update
Srisailam : శ్రీశైలం అవుట్ ఫ్లో 5.19 లక్షల క్యూసెక్కులు.. వేగంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం.. Latest Update
మన సాక్షి : తెలంగాణ బ్యూరో :
కృష్ణానది ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షాలకు నది ఉప్పొంగుతోంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నీటితో కలకలలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయం ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండాయి. ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి 3, 09, 600 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలంకు 5,18,539 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయంలో 885 అడుగుల నీటి సామర్థ్యానికి గాను 884 అడుగులుగా నీరుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకు ప్రస్తుతం 210 టీఎంసీల నీరు ఉంది.
శ్రీశైలం దిగువకు భారీగా నీటిని విడుదల చేయడం వల్ల నాగార్జున సాగర్ జలాశయం వేగవంతంగా నిండుతుంది. నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగులకు గాను 545 అడుగులకు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకు గాను 197 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇవి కూడా చదవండి :
District Sp : నారాయణపేట జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు.. ప్రకటించిన జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
NALGONDA : సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!









