Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 3.69 లక్షల క్యూసెక్కుల వరద.. క్రస్ట్ గేట్లను తాకనున్న నీరు, నేడు ఎడమ కాలువకు విడుదల, అప్పుడే గేట్లు ఓపెన్..!
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు 3.69 లక్షల క్యూసెక్కుల వరద.. క్రస్ట్ గేట్లను తాకనున్న నీరు, నేడు ఎడమ కాలువకు విడుదల, అప్పుడే గేట్లు ఓపెన్..!
మన సాక్షి :
నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శుక్రవారం సాయంత్రం నాటికి సాగర్ జలాశయంలో నీరు క్రస్ట్ గేట్లను తాకనున్నది. శ్రీశైలం నుంచి భారీగా నీటిని విడుదల చేయడం వల్ల వరద ప్రవాహం భారీగా పెరిగింది.
కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టులో 10 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశంలోకి 4. 64 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. దాంతో క్రస్ట్ గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 5.18 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాగా నాగార్జునసాగర్ జలాశయంలోకి 3. 69 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. నాగార్జున సాగర్ జలాశయంలో 312 నీటి నిలువ సామర్థ్యం 312 టీఎంసీల గాను ప్రస్తుతం 183 టీఎంసీలకు చేరింది. జల విద్యుత్ ఉత్పాదనతో పాటు కుడి కాల్వ అవసరాల కోసం 27 వేల క్యూసెక్కుల నీటిని దిగకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాగర్ జలాశయంలో క్రస్ట్ గేట్లను వరదనీరు తాకనున్నది. వరద ఇదేవిధంగా కొనసాగితే మరో వారం రోజుల్లో సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది.
నేడు ఎడమ కాలువకు నీటి విడుదల :
నాగార్జునసాగర్ ఎడమ కాలవకు శుక్రవారం సాగునీటిని విడుదల చేయనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నీటిని విడుదల చేస్తారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి హెలికాప్టర్లో సాగర్ కు వెళ్ళనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేస్తారు.
ఇది కూడా చదవండి :
Nagarjunasagar : నాగార్జునసాగర్ లో బాంబు స్క్వాడ్లు, జాగిలాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులపై క్యాబినెట్ కీలక నిర్ణయం.. సబ్ కమిటీ ఏర్పాటు..!









