Govt Land : దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా..!
Govt Land : దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా..!
మేడిపల్లి, (మన సాక్షి):
ప్రభుత్వ భూములను పూర్తి స్థాయిలో కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు పదే పదే చెప్తున్నా అది పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చడం లేదు.
సర్కారు భూముల పరిరక్షణకు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్న కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేసే వాళ్ళ నుండి కాపాడ లేక పోతున్నారంటే ఇందులో రెవెన్యూ అధికారుల అలసత్వం ఉందా లేక కబ్జా దారులు తెలివి మిరిపోయారా అనేది అర్దం కానీ ప్రశ్నగా మిగిలింది.
వివరాల్లోకి వెళితే బోడుప్పల్ లోని ప్రభుత్వ భూమిలో కొందరు కబ్జా దారులు రాత్రికి రాత్రే ఇంటి నిర్మాణాలు చేపట్టి పేదలకు అంటగట్టి లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. అయితే దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే అధికారులు చర్యలు తీసుకోవడం తప్ప రెవెన్యూ సిబ్బంది పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లోపంగా మారిందనేది తెలుస్తుంది.
కబ్జా దారులకు ఆదాయ మార్గంగా ప్రభుత్వ భూమి :
బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జా దారులకు వరంగా మారింది. గతంలో బలహీన వర్గాలకు ఇచ్చిన పట్టాల మాదిరిగానే మరో దొంగ పట్టాలు సృష్టించి వాటికి బై నెంబర్లు వేయడం వేరే వ్యక్తుల పేరుతో పట్టాలు తయారు చేసి రెవెన్యూ అధికారులను తప్పుదోవ పట్టించి సర్కారు భూములను కబ్జా చేయడం పరిపాటిగా మారింది.
కేవలం ప్రభుత్వ భూములను కబ్జా చేసి లక్షల రూపాయల సోమ్ము చేసుకునే గ్యాంగులు ఇక్కడ అదే ఆదాయ వనరుగా పెట్టుకుని జీవనం సాగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు.మరీ ఇప్పటికై అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా చూడాలి.
ALSO READ :
పోలిస్టేషన్ ముందే కారు అద్దాలు పగలగొట్టి చోరీ..!
Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!
మిర్యాలగూడ : ఎత్తిపోతల పథకాలపై చీఫ్ ఇంజనీర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్..!
Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!
Ration Cards : రేషన్ కార్డులపై కీలక నిర్ణయం.. వారి రేషన్ కార్డుల తొలగింపు..!









