Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!
Nagarjunasagar : సాగర్ లో నిలిచిపోయిన టూరిజం లాంచీలు.. నిరాశలో సందర్శకులు..!
తెలంగాణ టూరిజనికి ఆదాయానికి గండి….
ఆంధ్ర టూరిజం లాంచిల రాకపోకలు
నాగార్జునసాగర్, మన సాక్షి :
నాగార్జునసాగర్ నుండి నాగార్జునకొండకు పర్యాటకులను తీసుకువెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను శనివారం నుండి నిలిపివేశారు.
దీంతో సాగర్ సందర్శనకు వచ్చిన పర్యాటకులు నాగార్జున కొండను సందర్శించే అవకాశం లేక ఒకవైపు, కనీసం జాలి ట్రిప్పులో సాగర్ జలాశయంలో వివరించే అవకాశం లేక మరోవైపు నిరాశలకు గురయ్యారు.
నాగార్జునసాగర్ డ్యాం 26 గేట్లు ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నడంతో శనివారం నాడు అధిక సంఖ్యలో సాగర్ ని సందర్శించడానికి పర్యాటకులు వచ్చారు. అయితే శనివారం నాడు ఉన్నతాధికారులు టూరిజం లాంచీలను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారని స్థానిక బోటింగ్ పాయింట్ అధికారులు లాంచీలను నాగార్జున కొండకు తిప్పకుండా నిలిపివేశారు.
సాగర్ డ్యాం జల విన్యాసాలను చూసిన సందర్శకులు లాంచీలో విహరించుదామని గంటల తరబడి బోటింగ్ పాయింట్ వద్ద ఎదురు చూశారు. ఎంతసేపటికి తెలంగాణ టూరిజం లాంచీలను అందుబాటులోకి తీసుకురాకపోవడంతో సంబంధిత టూరిజం అధికారులను తిట్టుకుంటూ నిరాశతో వెనుతిరిగారు.
అయితే నాగార్జునసాగర్ తెలంగాణ వైపు నుండి నాగార్జున కొండకు వెళ్లే తెలంగాణ టూరిజం లాంచీలను నిలిపివేసిన విషయంలో తెలంగాణ టూరిజం వాటర్ ఫ్లూయిడ్ జనరల్ మేనేజర్ ఇబ్రహీంను వివరణ కోరగా నాగార్జునసాగర్ డ్యామ్ ఉన్నతాధికారుల నుండి తమకు తెలంగాణ టూరిజం లాంచిలను తాము చెప్పేంతవరకు తిప్పకూడదన్నారు.
శ్రీశైలం నుండి అధిక మొత్తంలో వరదనీరు వస్తున్న కారణంగా పర్యాటకుల భద్రత దృశ్య లాంచీల రాకపోకలను సాగర్ జలాశయంలో నిలిపివేయాలని తెలిపారని, ఈ కారణంగానే కొన్ని రోజులు పాటు తెలంగాణ టూరిజం లాంచిలను సాగర్ జలాశయంలో తిరగకుండా నిలిపివేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ టూరిజం లాంచిలను నిలిపివేసిన కారణంగా లక్షల రూపాయల్లో తెలంగాణ టూరిజo ఆదాయానికి గండిపడిన పర్యాటకుల భద్రత దృశ్య ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.
అయితే సాగర్ జలాశయంలో తెలంగాణ టూరిజం లాంచీల రాకపోకలు నిలిపివేసిన ఆంధ్ర ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు తమ లాంచీలను యదేచ్ఛగా నాగార్జున కొండకు శనివారం నాడు నడిపించడం గమనించదగినది.
శని ,ఆదివారాలు తో పాటు వరుసగా సెలవు దినాలు రావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు సాగరుకు వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో తెలంగాణ టూరిజం లాంచ్ లను నిలిపివేయడంపై లోగుట్టు ఏంటి అని పలువురు చర్చించుకుంటున్నారు.
ALSO READ :
Ration Cards : రేషన్ కార్డులపై సంచలన నిర్ణయం.. ఇవీ అర్హతలు..!
Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే









