Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!
Jobs : తెలంగాణలో వెయ్యి పోస్టుల భర్తీ.. జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు..!
హైదరాబాద్, మన సాక్షి :
తెలంగాణలో 1000 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ లకు ఉద్యోగాలు భర్తీ చేయడంతో పాటు కొత్తగా నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటించింది. నిరుద్యోగులకు నిరాశ కలగకుండా జాబ్ కాలండర్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
రాష్ట్రంలో గ్రంథాలయ పోస్టులను వెయ్యి ఖాళీలను త్వరలో భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. హైదరాబాదులోని అఫ్జల్గంజ్ కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఓ కార్యక్రమంలో పాల్గొని వెల్లడించారు. తెలంగాణ గ్రంథాలయంలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయనున్నట్లు.. సీఎంతో మాట్లాడి జాబ్ క్యాలెండర్ లో ఆ పోస్టులు పెట్టించేలా చూస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రంధాలయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ నాయకత్వంలో కేరళలో కంటే ఎక్కువ గ్రంధాలయాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని పొన్నం ప్రభాకర్ వివరించారు.
ALSO READ :
Medical college : వైద్య కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..!
NALGONDA : వీరు మామూలోళ్లు కాదు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
District collector : ప్రజావాణితో సమస్యలకు చెక్.. జిల్లా కలెక్టర్..!
District collector : నేను గంజాయి వాడను.. జిల్లా కలెక్టర్ వినూతన ప్రచారం..!









