Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ఉద్యోగంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణవైద్యంసూర్యాపేట జిల్లా

Medical college : వైద్య కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..!

Medical college : వైద్య కళాశాలలో కాంట్రాక్టు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు..!

సూర్యాపేట, మనసాక్షి :

బోధన సిబ్బంది నియమకాల ప్రక్రియ పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా గల బోధన సిబ్బంది ని కాంట్రాక్టు పద్దతిన నియమించేందుకు జరుగుతున్న ఇంటర్యూ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలో 3 ప్రొపెసర్ పోస్ట్లు, 9 అసోసియేట్ ప్రొపెసర్లు పోస్ట్లు, 48 అసిస్టెంట్ ప్రొపెసర్లు పోస్ట్లు, 23 సీనియర్ రెసిడెంట్ పోస్ట్లు, 15 మంది ట్యూటర్ల నియమాకం కాంట్రాక్టు పద్దతిలో నియమించుటకు ఇంటర్యూలు జరుగుతున్నాయని, బోధన సిబ్బంది నియమాక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

తదుపరి ఎం బి బి ఎస్ 3 వ సవంత్సర లెక్చరర్ హాల్ ని అలాగే కళాశాల ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ డాక్టర్ జయలత, సూపరిటీడెంట్ డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ గురురాజ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : 

Nelakondapally : పాపం.. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్లిందని ఆ చిన్నారులకు తెలియదు..!

Narayanpet : పేటలో బంద్ సంపూర్ణం.. తెరుచుకోని దుకాణాలు, మూతపడిన విద్యా సంస్థలు..!

Independence day : జెండా పండుగ ఎక్కడ.. సీఎం రేవంత్ రెడ్డి జెండా ఎగురవేసేది అక్కడేనా..!

మరిన్ని వార్తలు