దర్జాగా కారులో వచ్చి.. రాత్రికి రాత్రే షాపులన్నీ దోచేశారు, సీసీ పూటేజీలో రికార్డ్..!
దర్జాగా కారులో వచ్చి.. రాత్రికి రాత్రే షాపులన్నీ దోచేశారు, సీసీ పూటేజీలో రికార్డ్..!
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో దొంగలు స్వైర విహారం చేశారు. అసలు ఇక్కడ పోలీస్ పెట్రోలియం ఉండదన్న రీతిలో నడి చౌరస్తాలో ఓ షాపు షట్టర్ ను గడ్డపారలతో పెకిలించి పకడ్బందీగా దొంగతనం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
దాదాపు అనేక షాపుల్లో ఇదే రీతిలో రాత్రికి రాత్రే దొంగలు తెగబడ్డారు. ఇక్కడి పోలీసులకు దొంగలు తామేమిటో నిరూపించుకున్నారు. దొంగలకు సవాల్ విసిరిన ఈ దొంగల స్వైర విహారంతో ఒక్కసారిగా పట్టణంలో భయం అలుముకుంది.
పట్టణంలోని నడి చౌరస్తాలో ఉన్న జీ ఆర్ మొబైల్స్ లో దొంగలు షట్టర్ గడ్డపారతో తొలగించి 1,60,000 నగదు తీసుకెళ్లారు, లక్షల రూపాయల విలువచేసే సెల్ ఫోన్లను మాత్రం దొంగలు ముట్టుకోలేదు. చాలా పకడ్బందీగా తెలివిగా ఆలోచించి సెల్ఫోన్లను చోరీ చేయలేదు.
అదేవిధంగా నేషనల్ మార్ట్, స్నేహ ఎలక్ట్రికల్స్, కేకే ఎలక్ట్రానిక్స్, వోల్టాస్ షాప్, పరిగి రోడ్డులోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ హోల్సేల్ కూల్ డ్రింక్స్ షాపులో 20,000 ఇంకా అనేకచోట్ల నగదును తస్కరించారు. ట్రేడర్స్ లో ఒక కాటన్ సిగరెట్లను దొంగిలించారు. ఈ వరస దొంగతనాలపై పోలీసులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.
అయితే క్లూస్ టీం వెంటనే రంగంలోకి దిగింది. చోరీ జరిగిన వ్యాపార సముదాయాలలో ఫింగర్ ప్రింట్స్ ను పోలీసులు సేకరించారు. నలుగురు దొంగలు జిఆర్ మొబైల్స్ లో ప్రవేశించినట్టు సీసీ ఫుటేజీలో లభ్యమయింది.
ఇంకా పట్టణంలో ఎక్కడెక్కడ చోరీలు జరిగాయో ఏమిటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దాదాపు 5 లక్షల రూపాయల నగదు వరకు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. ఓ కారు ఎక్స్ యూవి మహీంద్రా 500లో దర్జాగా వచ్చిన దొంగలు విచ్చలవిడిగా దొంగతనాలు చేశారు.
LATEST NEWS :
తెలంగాణలో భారీ వర్షాలు.. ఉప్పల్ లో భారీగా ట్రాఫిక్ జామ్, పాఠశాలలకు హాలిడే..!
TGSRTC : మహిళా కండక్టర్ మానవత్వం.. ఆర్టీసీ బస్సులో గర్భిణీ ప్రసవం..!









