యువకుడి సెల్ఫీ వీడియో.. ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..!
యువకుడి సెల్ఫీ వీడియో.. ప్రాణం తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..!
సూర్యాపేట, మన సాక్షి :
ఆన్‌లైన్ బెట్టింగ్ ఒక యువకుడి ప్రాణం తీసింది. చేసిన అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి సాగర్ ఎడమ కాలువలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు కనుగొన్నారు.
వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ ఎస్సై రవీందర్ తెలియజేసిన వివరాల ప్రకారం.. నల్గొండ లోని నెహ్రూ నగర్ కు చెందిన తడకమల్ల సోమయ్య కుమారుడు సాయి కుమార్ (28) బీటెక్ పూర్తి చేశాడు. తన బాబాయితో కలిసి కిరాణా దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు.
దుకాణాన్ని చూసుకుంటూనే ఆన్ లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడ్డాడు. సుమారు 2 కోట్ల వరకు నష్టపోయి అప్పుల పాలయ్యాడు. చేసినప్పులు తీర్చలేక మనస్థాపం చెంది సాయికుమార్ ఈనెల 17వ తేదీ ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యులు నల్లగొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసుగా పోలీసులు నమోదు చేసుకున్నారు. సాయికుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సేకరించిన వివరాల ప్రకారం.. పోలీసులు హాలియా వద్ద సాగర్ ఎడమ కాలువ కట్టపై సెల్ ఫోన్, ద్విచక్ర వాహనం ఉన్నట్లు గుర్తించారు.
కాగా తన ఫోన్ లో సెల్ఫీ వీడియోలో సాయికుమార్ అప్పులు తీర్చలేక కాలువలో పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. ఏ మేరకు కుటుంబ సభ్యులు గాలించగా సోమవారం పెన్ పహాడ్ మండలం దోసపాడు వద్ద సాగర్ కాలువలలో మృతదేహం లభ్యమైనది.
మృతుడి సోదరుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.









