Suryapet : సూర్యాపేటలో మృతదేహాల కలకలం..!
Suryapet : సూర్యాపేటలో మృతదేహాల కలకలం..!
మన సాక్షి, సూర్యాపేట :
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మృతదేహాల కలకలం రేపుతోంది. ఒకేరోజు రెండు గుర్తుతెలియని మృత దేహాలు లభ్యం కావడంతో పట్టణంలో కలకలం సృష్టిస్తుంది.
సూర్యాపేట పట్టణంలోని అంజనాపూరి కాలనీ లో ఫంక్షన్ హాల్ కు ఎదురుగా ఉన్న సద్దలచెరువులో సుమారు 60 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి మృతదేహం లభ్యమయింది. అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇతడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వివరాలు తెలిసినవారు 8712686005 సంప్రదించాలని పోలీసులు కోరారు.
అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి చెందాడు. ఇతడు వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటాయి.
ఇతడి కి సంబంధించిన వివరాలు కూడా లేకపోవడంతో సూర్యాపేట పట్టణ పోలీసులు 8712686095 నెంబర్ కు సంప్రదించాలని కోరారు. ఒకేరోజు రెండు గుర్తుతెలియని మృతదేహాలు వెలుగు చూడటంతో పట్టణంలో కలకాలం సృష్టిస్తుంది.
LATEST UPDATE :
మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!
సరైన పత్రాలు లేకుండానే పంట రుణాలు.. ఆ రైతులకు రుణమాఫీ వస్తుందా..!
మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!









