మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ : ప్రాధాన్యత లేదని కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం.. పరామర్శించిన ఎమ్మెల్యే..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని మిర్యాలగూడ పట్టణంలో ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రెండు రోజుల క్రితం మిర్యాలగూడ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకుంది.
కాగా కార్యకర్తకు మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా ఆ కార్యకర్తలు స్థానిక ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు.
ఇందిరమ్మ కాలనీకి చెందిన భగవాన్ నాయక్ ను మిర్యాలగూడ శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి గాంధీ హాస్పిటల్ నందు పరామర్శించినారు. భగవాన్ కుటుంబ సభ్యులు, స్పెషలిస్ట్ డాక్టర్లతో ఎమ్మెల్యే మెరుగైన వైద్యం కొరకు చర్చించినారు.
అవసరమైనచో కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేపిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగినది. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించడం జరిగినది. వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చినారు.
ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మిట్టపల్లి వెంకటేష్ తదితరులు ఉన్నారు.
LATEST UPDATE :
Miryalaguda : వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలి..!
మిర్యాలగూడ : కనిపించని ప్లాస్టిక్ కవర్స్ నిషేధం.. విక్రయధారులతో ఎమ్మెల్యే..!
Miryalaguda : మిర్యాలగూడ సిఐ సుధాకర్ పై వేటు..!
Nalgonda : ప్రశ్నిస్తే బ్యాంకు చుట్టూ తిప్పుతాం.. రైతులను హడలెత్తిస్తున్న బ్యాంకు మేనేజర్..!
Job Mela : టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. ఆగస్టు 21న జాబ్ మేళా..!









