Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
Cm Revanth : రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో లక్ష రూపాయలు జమ..!
మనసాక్షి , తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ తెలియజేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చర్యలు చేపట్టింది. ఇటీవల రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసింది.
అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తుంది. అదే విధంగా ఆరోగ్యశ్రీ పెంపు తో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందిస్తుంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో కొత్త పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో భాగంగా పేద ఇంటి ఆడ పిల్లల పెళ్లి కి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు తులం బంగారం ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నారు.
ALSO READ : Panchayathi Elections : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ షురూ.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల..!
తెలంగాణ బడ్జెట్లో ఈ పథకానికి 2175 కోట్ల రూపాయలను కేటాయించింది. కాగా తాజాగా 1225 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు 65, 026 కల్యాణ లక్ష్మి పథకం కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 33,550 దరఖాస్తులు వచ్చాయని, 2024 మార్చి 31వ తేదీ వరకు 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇప్పటివరకు తాసిల్దార్ల వద్ద 28,225 దరఖాస్తులు, ఆర్టీవో ల వద్ద 12,555 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 24,038 కొత్త దరఖాస్తులతో పాటు పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు కూడా నిధులు మంజూరయ్యాయి. వీరందరికీ త్వరలో వారి వారి ఖాతాలలో లక్ష రూపాయలు ప్రభుత్వం జమ చేయనున్నది.
LATEST UPDATE ;
Ration Cards : తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్..!
Gruhajyothi : జీరో కరెంటు బిల్లు రాని వాళ్లకు మరో అవకాశం.. ఇలా చేస్తే సరిపోతుంది..!
Rythu Barosa : రైతు భరోసా మార్గదర్శకాలు ఫిక్స్.. వారికే పెట్టుబడి సహాయం..!









