TOP STORIESBreaking News

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. గంటల వ్యవధిలోనే అంత వర్షం..!

Nalgonda : నల్గొండ జిల్లాలో భారీ వర్షం.. గంటల వ్యవధిలోనే అంత వర్షం..!

మన సాక్షి, నల్గొండ బ్యూరో :

నల్లగొండ జిల్లాలో భారీ వర్షం కురిసింది. శనివారం ఉదయం 8.30 గంటల నుంచి ఆదివారం తెల్లవారుజామున 6 గంటల వరకు భారీ వర్షం నమోదయింది. గంటల వ్యవధిలోనే అంత భారీ వర్షం నమోదు కావడం ఈ ఏడాది ఇదే మొదటిసారి. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా వర్షాపాతం నమోదైన ప్రాంతాలలో కేతేపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదయింది.

కేతెపల్లిలో 173.8 m వర్షం కురిసింది. అదేవిధంగా చందంపేటలో 151.5m వర్షపాతం కురిసింది. వేములపల్లి మండలం బుగ్గ బాయ్ గూడెంలో 146.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా అతి తక్కువగా గట్టుప్పల్ మండలం శివన్న గూడెం లో 35.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పూర్తిస్థాయిలో నిండి అలుగులు పోస్తున్నాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణాలలో పలు కాలనీలలో ఇళ్లలోకి నీరు చేరింది. వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు అధికారులు కూడా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

LATEST UPDATE : 

BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!

TG News : తెలంగాణలో వర్షాలు.. పాఠశాలలకు సెలవు..!

TG NEWS : తెలంగాణ కాంగ్రెసులో కోల్డ్ వార్..? ఉత్తమ్ సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు..!

రేవంత్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ భేటీ.. కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు