ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యం..!
ఆర్టీసీ డ్రైవర్ చాకచక్యం..!
అందోలు, మనసాక్షి :
డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం వర్షం కురుస్తుండడంతో మెదక్ జిల్లా అందోలు మండలం కిచ్చన్నపల్లి సమీపంలో పెద్ద చెట్టు పడిపోవడంతో దాన్ని తప్పించడడానికి ప్రయత్నించి అదుపుతప్పడంతో బస్సును కిందకు చాకచక్యంగా దింపడంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు సురక్షితంగా తప్పించుకున్నారు.
సంగారెడ్డి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పిట్లం నుంచి సంగారెడ్డికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ కృష్ణ సమయస్పూర్తితో, చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు ముందు బాగం కొంత దెబ్బతింది.
సంఘటన స్థలానికి ఎస్‌ఐ పాండు, ఆర్డీఓ పాండు, డిప్యూటీ తహసీల్దారు మధుకర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరుపతిలు సహయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరుగకుండా వ్యవహరించడం పట్ల డ్రైవర్ ను అధికారులు అభినందించారు.
LATEST UPDATE :
మిర్యాలగూడ : నాలాలపై అక్రమ నిర్మాణాలు.. వర్షం వస్తే ఇండ్లలోకి చేరుతున్న మురుగునీరు..!
ఉధృతంగా లక్ష్మీదేవిగూడెం వాగు.. మిర్యాలగూడ – సూర్యాపేట రోడ్డు మూసివేత..!
BREAKING : విజయవాడ హైవే బ్లాక్.. మిర్యాలగూడ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు..!
వాగులో కొట్టుకుపోయిన కారు.. కనిపించకుండా పోయిన తండ్రి, కూతురు..!










