TOP STORIESBreaking Newsవ్యవసాయం

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

Runamafi : రుణమాఫీ పై స్పష్టత.. మాఫీ కాని వారికి ఎప్పుడంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుల రెండు లక్షల రుణమాఫీ పై స్పష్టత వచ్చింది. 2 లక్షల రుణమాఫీ చేస్తూ ప్రభుత్వం మూడు విడతలుగా ఆగస్టు 15వ తేదీలోగా రైతుల ఖాతాలలో జమ చేసింది. కానీ అనేక మంది రైతులకు రుణమాఫీ కాకపోవడంతో గందరగోళం ఏర్పడింది. రెండు లక్షల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలు ఉన్న రైతులకు మాఫీ ఎప్పుడు వస్తుందనే విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.

రుణమాఫీ కానీ రైతులు బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీ మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశారు.

సాంకేతిక కారణాలవల్ల అనేకమంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనలను చెక్ పెట్టేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రివర్గం రైతులకు భరోసా ఇచ్చారు.

వివిధ సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతుల నుంచి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించారు. క్షేత్రస్థాయిలో మండలాల వారీగా రైతుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. ఆ తర్వాత రైతు భరోసా యాప్ ద్వారా వ్యవసాయ అధికారులు రుణమాఫీ కానీ రైతుల ఇంటింటికి వెళ్లి కుటుంబ నిర్ధారణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 42 లక్షల మంది రైతులకు 31 వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15వ తేదీ లోగా 18 వేల కోట్ల రూపాయలను 22 లక్షల రైతుల ఖాతాలలో జమ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా 1,20,000 ఖాతాలలో ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవడం, లక్ష 61 వేల ఖాతాలలో ఆధార్, పాసుబుక్ లింకు లేకపోవడం, 1. 50 లక్షల ఎకౌంట్ లలో బ్యాంకు తప్పిదాలు ఉండడం, 4 లక్షల 83 వేల ఎకౌంట్లకు రేషన్ కార్డు లేని ఖాతాలు ఉండడం, ఎనిమిది లక్షల ఎకౌంట్లకు రెండు లక్షల కంటే ఎక్కువ రుణాలు ఉండటం జరిగింది.

రెండు లక్షల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలు ఉన్న రైతులకు అదనంగా ఉన్న డబ్బులు చెల్లించాలని ప్రభుత్వం పేర్కొన్నది. రెండు లక్షల రూపాయలకు అదనంగా ఉన్న డబ్బులు ఎంతో మంది రైతులు ఇప్పటికే బ్యాంకులకు చెల్లించారు. కానీ ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రెండు లక్షల రూపాయలకు బ్యాంకు రుణాల ఉన్న రైతుల విషయంలో స్పష్టం చేశారు.

రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని స్పష్టం చేశారు. అదనంగా ఉన్న రుణాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించుకోవాలని పేర్కొన్నారు. రెండు లక్షల రూపాయల రుణంకు పైగా ఉన్న రైతులు బ్యాంకులకు ఎప్పుడు చెల్లించాలనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని తెలిపారు.

ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతనే రెండు లక్షల రూపాయలకు పైగా ఉన్న అదనపు రుణాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా విడుతల వారిగా చెల్లించాల్సి ఉండే అవకాశాలు ఉన్నాయి.

మొదటగా 2 లక్షల రూపాయల నుంచి రెండున్నర లక్షల రుణం ఉన్నవారు, రెండవ విడతలో రెండున్నర లక్షల రూపాయల నుంచి 3 లక్షల రూపాయల రుణం వరకు, మూడవ విడతలో మూడు లక్షల రూపాయల రుణంకు పైగా ఉన్నవాళ్లు ప్రభుత్వం పేర్కొన్న తేదీలలో చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాతనే అదనంగా ఉన్న డబ్బులను రైతులు చెల్లిస్తే వారికి రుణమాఫీ వర్తించే అవకాశాలు ఉన్నాయి.

LATEST UPDATE : 

Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?

Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!

మరిన్ని వార్తలు