Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
Cm Revanth Reddy : తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ తెలియజేశారు. తుఫాన్ వరదల వల్ల రాష్ట్రంలో భారీగా నష్టం ఏర్పడింది. రోడ్లు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావడంతో పాటు అనేకమంది పేదలకు కూడా భారీగా నష్టం జరిగింది. ఖమ్మం జిల్లాను తుఫాన్ కుదిపేసింది.
పేదల గృహాలు కూలిపోయాయి. కాగా తుఫాన్ వల్ల నష్టం జరిగిన వారిని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. నష్టపోయిన వారికి తక్షణ సహాయంగా పదివేల రూపాయలను అందిస్తున్నారు. తుఫాన్ వల్ల ఇల్లు కూలిపోయిన వారికి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ తెలిపారు.
అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఐదు లక్షల రూపాయల సహాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందించనున్నది.
తుఫాన్ వల్ల ఇండ్లు కూలిపోయిన వారికి ఈ పథకంలో మొదటి ప్రాధాన్యతగా మొదటి విడతలోనే ఇండ్లు మంజూరు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక అంచనా ప్రకారం 7000 గృహాలు కూలిపోయినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరానికి పదివేల రూపాయలను అందించనున్నారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలను అందజేయనున్నారు.
అదేవిధంగా పశువులు చనిపోతే ఒక్కొక్క దానికి 50 వేల రూపాయలు చొప్పున, మేకలు, గొర్రెలు చనిపోతే ఒక్కొక్క దానికి 5000 రూపాయలు చొప్పున ప్రభుత్వం సహాయం అందించనున్నది. అందుకు గాను క్షేత్రస్థాయిలో మండల స్థాయి అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తయ్యాక ఆర్థిక సహాయం అందించనున్నారు.
LATEST UPDATE :
బ్లడ్ మూన్.. ఈనెల 28న భూమి అంతం.. వణుకు పుట్టిస్తున్న సిద్ధాంతకర్తల సాక్షాలు..?
Rythu : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమా కోసం మొబైల్ యాప్..!
తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఉచిత బియ్యంతో పాటు ఇక అవి కూడా..!
Cm Revanth Reddy : తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!









