TOP STORIESBreaking Newsతెలంగాణ

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్:

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకే సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు మహిళలనే ప్రామాణికంగా తీసుకుంటుంది. ఇప్పుడు మహిళల ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకుగాను ప్రభుత్వం అతిపెద్ద నిర్ణయం తీసుకుంది.

మహిళలు 65 రకాల వ్యాపారాలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించి రుణాలు ఇస్తుంది. వాటిలో ముఖ్యంగా పేపర్ ప్లేట్ల తయారీ, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, మొబైల్ ఫోన్ రిపేరింగ్, సెలూన్, బ్యూటీ పార్లర్, ఫ్యాన్సీ స్టోర్స్ , టైలరింగ్, కూరగాయల వ్యాపారం, కిరాణా స్టోర్, గాజుల షాపు, బేకరీ షాపు, జిరాక్స్ సెంటర్, డెకరేషన్ అండ్ లైటింగ్, లాండ్రీ, ఫోటో స్టూడియో, చేపల అమ్మకం, ఇటుకల తయారీ, కార్పెంటర్, సెంట్రింగ్, ఇంటర్నెట్, వెల్డింగ్, కోళ్ల పెంపకం, ఎలక్ట్రిక్ ఆటోల నిర్వహణ, పాడి పశువుల పెంపకం.. ఇలాంటి యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రుణాలు అందజేస్తుంది.

ప్రభుత్వం.. మహిళ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు (ఎస్ జి హెచ్ ) లో ఉన్నవారికి ఇలాంటి అవకాశాలు కల్పిస్తుంది. ప్రభుత్వం స్వయం ఉపాధి పొందేందుకు గాను మహిళలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు అందజేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే దరఖాస్తు చేసుకున్న మహిళలకు రుణాలు అందించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మహిళా సంఘాలకు ఉపాధి కల్పనకు గాను ఒక్కొక్క మహిళకు 5 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలు పొందవచ్చును.

బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలను ప్రతి నెల వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లించే వెసులుబాటును కల్పిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీనిధి సంస్థలు 60 లక్షల మంది సభ్యులుగా ఉన్నారు. ఈ సంస్థలో మహిళా సంఘాలతో పాటు గ్రామ సమాఖ్యలు, మండల సమాఖ్యలు, పట్టణ సమాఖ్యలు కూడా ఉన్నాయి. శ్రీనిధి సంస్థ ద్వారా రుణం తీసుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది.

ప్రభుత్వం వీరికి పావలా వడ్డీకి రుణాలను అందిస్తుంది. రుణం తీసుకున్న మహిళలు వాయిదా పద్ధతిలో టైం ప్రకారం చెల్లిస్తే పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. మహిళలు ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు ఇంకా కొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

LATEST UPDATE : 

Govt Hospital : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు.. డిసిహెచ్ వార్నింగ్..!

మిర్యాలగూడ : ఈ ముఠాలో మామూలోళ్లు కాదు.. ఏకంగా ధర్మల్ పవర్ ప్లాంట్ కే కన్నం..!

Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)

Good News : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్.. పుస్తకాలు సౌకర్యాలు ఉచితంగా..!

మరిన్ని వార్తలు