Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

Good News : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్.. పుస్తకాలు సౌకర్యాలు ఉచితంగా..!

Good News : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్.. పుస్తకాలు సౌకర్యాలు ఉచితంగా..!

నల్లగొండ , మన సాక్షి :

నల్గొండ జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి జిల్లా కలెక్టర్ గుడ్ న్యూస్ తెలియజేశారు. కేంద్ర గ్రంథాలయంలో పాఠకులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు అవసరమైన అన్ని పుస్తకాలతో పాటు సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం అయన జిల్లా కేంద్ర లైబ్రరీని ఆకస్మికంగా తనిఖీ చేసి గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు తయారవుతున్న అభ్యర్థులతో ముఖాముఖి మాట్లాడారు.

లైబ్రరీలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని? ఏమైనా సమస్యలు ఉన్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు. కాగ్ తాగునీటి సమస్య ఉందని, అలాగే టాయిలెట్లను సరిగా శుభ్రం చేయటం లేదని, వర్షం వచ్చినప్పుడు వర్షపు నీరు లైబ్రరీ ఆవరణలోకి వస్తున్నదని మొరం వేయించాలని ,అలాగే లైబ్రరీ సమయాన్ని రాత్రి 10 గంటల వరకు పొడిగించాలని, ర్యాక్ లు కావాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

ఇందుకు స్పందించిన జిల్లా కలెక్టర్ రెండు రోజుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామని , అలాగే టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా పారిశుధ్య సిబ్బందిని తక్షణమే నియమించాలని లైబ్రరీ నాగయ్యను ఆదేశించారు.

పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు చదువుకునేందుకు వీలుగా లైబ్రరీని మహిళా అభ్యర్థులకు రాత్రి 9 వరకు, పురుష అభ్యర్థులకు 10 గంటల వరకు పొడిగించాలని ఆదేశించారు. అంతేకాకుండా లైబ్రరీకి తక్షణమే 20 ర్యాక్ లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వర్షపు నీరు రాకుండా మొరం వేసేందుకు అధికారులను ఆదేశించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మహిళ, పురుష అభ్యర్థుల విభాగాలలో మాట్లాడుతూ పోటీ పరీక్షలకు హాజరయ్యె అభ్యర్థులందరూ రాష్ట్రస్థాయి పోటీని ఎదుర్కొనే విధంగా తయారు కావాలని, పరీక్షలో ఒక్క మార్కు తగ్గిన ర్యాంకు తగ్గిపోతుందని చెప్పారు .చదవడంతో పాటు చదివినదంతా ప్రాక్టీస్ చేయాలని, అంతేకాక పూర్తి శక్తి ఉన్నంత మేరకు చదవాలని ,ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో చదివితే తప్పనిసరిగా విజయం సాధిస్తారని తెలిపారు.

ఈ సందర్భంగా పోటీ పరీక్షలను ఎదుర్కొని విజయవంతంగా రాసి ఉద్యోగం సాధించేందుకు అవసరమయ్యే మెలకువలను ఆయన అభ్యర్థులకు తెలియజేశారు. పోటీ పరీక్షల్లో షార్ట్ కట్స్ ఉండవని, కష్టపడి చదవడం ఒకటే చేయాలని అన్నారు. సాధించాలనుకున్న దానిపైనే దృష్టి సారించాలని ,ఇతర విషయాలపై దృష్టి పెట్టకుండా, చదువు పైన ఏకాగ్రత పెడితే ఆ విధంగా మైండ్ ను ట్రైనింగ్ ఇవ్వాలని తెలిపారు.

కాగా కొంతమంది అభ్యర్థులు లైబ్రరీ సెక్రటరీ, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సిబ్బంది దురుసు ప్రవర్తనను మానుకోవాలని, మరోసారి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైటింగ్ ప్యాడ్స్ కావాలన్న అభ్యర్థుల కోరిక మేరకు మహిళలకు 50, పురుషులకు 50 మొత్తం 100 రైటింగ్ ప్యాడ్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలని సీసీ ని ఆదేశించారు. లైబ్రరీకి వచ్చే పాఠకులతో పాటు, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు లైబ్రరీని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేలా చూడాల అన్నారు.

LATEST UPDATE : 

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!

Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)

Nalgonda : తప్పుడు పత్రాలతో ఇండ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న జర్నలిస్టులపై చర్య తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు..!

పదవి లేకున్నా సేవా దృక్పథం.. సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు..!

మరిన్ని వార్తలు