పదవి లేకున్నా సేవా దృక్పథం.. సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు..!
పదవి లేకున్నా సేవా దృక్పథం.. సొంత డబ్బులతో రోడ్లకు మరమ్మతులు..!
చింతపల్లి. మన సాక్షి :
ఈ కాలంలో పదవులు ఉంటేనే నాలుగు డబ్బులు వెనకేసుకుంటారు. పదవి లేకుంటే ఎవరిని పట్టించుకోరు. కానీ ఆ సర్పంచ్ మాజీ అయినా కూడా గ్రామస్తులకు సేవ చేస్తూనే ఉన్నాడు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి రోడ్ల మరమ్మతులు చేయించి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
చింతపల్లి మండల పరిధిలోని తీదేడు ఎక్స్ రోడ్ నుండి గ్రామానికి వెళ్లే బీటి రోడ్ గుంతల మయంగా మారింది. గతంలో వేసిన బీటీ రోడ్లు కు గత పది సంవత్సరాల నుండి నిధులు మంజూరు చేయకపోవడంతో చింతపల్లి మండలంలోని తీదేడు నెలవలపల్లి, తిరుమలాపురం,, గడియ గౌరారం, కురంపల్లి, కిష్టరాయనపల్లి, వింజమూర్, హమంతాలపల్లి, మల్లారెడ్డిపల్లి, చింతపల్లి గ్రామాల్లోని బీటీ రోడ్లు పూర్తిగా వర్షాలకు గుంతల మాయంగా మారాయి.
సేవా దృక్పథంతో పదవి ఉన్న లేకున్నా తన గ్రామానికి తన వంతు సహాయ సహకారం అందించాలనే ఉద్దేశంతో ఆ గ్రామ మాజీ సర్పంచ్ కాయితి జితేందర్ రెడ్డి సర్పంచ్ పదవి పూర్తయి ఆరు నెలలు అయినప్పటికీ తన గ్రామం పై ఉన్న ప్రేమ తో ప్రత్యేక అధికారు ల పాలన కొనసాగుతున్నప్పటికీ, తన సొంత ఖర్చులతో గుంతల మయంగా మారిన బీటీ రోడ్డుపై మట్టిని పోయించి. వాహన దారులకు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రజల సంక్షేమం కోసం తన గ్రామ అభివృద్ధి కోసం తాను ఎల్లవేళలా ముందుండి గ్రామానికి సహాయ సహకారాలు అందిస్తానని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ ప్రజలు వారు గ్రామానికి చేస్తున్న సేవను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దాసరి శ్రీనివాస్ యాదవ్, దాసరి మారయ్య, మాజీ ఉప సర్పంచ్ ధరణి పతి రమణారావు, శ్రీను, కొరివి గిరి, మురళి, అంజయ్య, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
LATEST UPDATE :
UPI : యూపీఐ పేమెంట్ ల ద్వారా మోసాలు.. 13 మంది ముఠా అరెస్ట్..!
Suryapet : చిట్టి చేతులు.. భారీ సహాయం..!
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు స్వీకరణ.. 17 వరకు గడువు పెంపు..!









