ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన..!
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా ప్రకటన..!
మన సాక్షి , వెబ్ డెస్క్ :
ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన మద్యం కేసులో తీహార్ జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదలైన తర్వాత పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
కొత్త ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు మరో రెండు రోజుల్లో శాసనసభ పక్ష సమావేశం జరగనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికలను మహారాష్ట్ర ఎన్నికలతో పాటు నవంబర్ లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు జరిగే వరకు తమ పార్టీ నుంచి మరొకరు ముఖ్యమంత్రి అవుతారని ఆయన అన్నారు.
రెండు రోజుల తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నాను. ప్రజలు తీర్పు ఇచ్చేంతవరకు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను, ప్రతి ఇంటికి, వీధికి వెళ్తాను తప్ప ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోను నేను ప్రజల నుండి తీర్పు పొందుతాను అని ఆయన పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో పార్టీ సభ్యుడిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.
LATEST UPDATE :
Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
Batti Vikramarka : రైతు రుణమాఫీ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!









