Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు గుడ్ న్యూస్.. మాఫీ ఎప్పుడంటే, మంత్రి తుమ్మల స్పష్టం..!
మన సాక్షి , తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలో రైతు రుణమాఫీ గందరగోళమైన పరిస్థితి నెలకొన్నది. రైతులందరికీ రుణమాఫీ కాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం అందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటన చేసినప్పటికీ కొందరికే రుణమాఫీ అయింది.
31 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ 19 వేల కోట్ల రూపాయల మేర రైతులకు రుణమాఫీ చేశారు. మిగతా సుమారు 12 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సి ఉంది. దాంతో రైతులు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తున్నారు
సాంకేతిక కారణాల కారణంగా చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదు. దాంతో రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసింది. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా వ్యవసాయ అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహిస్తున్నారు.
రైతుల కుటుంబ నిర్ధారణ అనంతరం రుణమాఫీ వస్తుందని అధికారులు రైతులకు భరోసా కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 50% పైగా ఇంటింటి సర్వే పూర్తయింది. కాగా వివిధ సాంకేతిక కారణాలవల్ల రుణమాఫీ కానీ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలియజేశారు.
శుక్రవారం మహబూబ్నగర్ జిల్లాలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ రైతు రుణమాఫీ పై స్పష్టం చేశారు. సాంకేతిక కారణాల కారణంగా రుణమాఫీ కానీ రైతులకు ఈ నెలాఖరులో చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఆగస్టు 15వ తేదీ వరకు మూడు విడుదలగా 24 లక్షల మంది రైతులకు 19 వేల కోట్ల రూపాయల మేరకు మాఫీ చేశారు. ఇంకా 12 వేల కోట్ల రూపాయల మేర మాఫీ చేయాల్సి ఉంది. వీరందరికీ కూడా కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుంది. సర్వే అతి త్వరలో పూర్తికానున్నది.
సర్వే పూర్తయిన వెంటనే రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలలో జమకానున్నాయి. దాంతో ఈ నెలాఖరు లోపు రుణమాఫీ అందరికీ వర్తింప చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు భరోసా ఇచ్చారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అందుతుందని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
LATEST UPDATE :
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!
Miryalaguda : ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలి.. లేదంటే చర్యలు..!










