Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!
Rythu Barosa : రైతులకు శుభవార్త, రైతు భరోసాపై క్లారిటీ.. వారికి మాత్రమే, మంత్రి తుమ్మల కీలక ప్రకటన..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు భరోసా పథకం కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుండడంతో రైతులంతా బ్యాంకులు, వ్యవసాయ శాఖ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. రుణమాఫీ కాని వారందరికీ అందజేస్తామని ప్రభుత్వం చెప్పడంతో పాటు ఇంటింటికి సర్వే కూడా నిర్వహిస్తుంది.
ఇది ఇలా ఉండగా వానాకాలం సీజన్ సగం గడిచినప్పటికీ రైతు భరోసా పథకం అమలు చేయలేదు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం అమలు చేసి రైతులకు ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున పెట్టుబడి సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
కాగా గత యాసంగి సీజన్ లో రైతు బంధు పేరుతో పాత పద్ధతిలోనే పెట్టుబడి సహాయం అందజేశారు. వానాకాలం సీజన్ ప్రారంభం కాకముందే జూన్, జూలై మాసంలోనే రైతు భరోసా అమలు చేస్తారని రైతులు భావించారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు.
కాగా మహబూబ్ నగర్ జిల్లాలో మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు. పంటలు పండించిన భూములకే రైతు భరోసా ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కొండలకు, గుట్టలకు సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇచ్చేది లేదన్నారు.
పంట పండించే భూములకే రైతు భరోసా ఇస్తామని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండలకు, గుట్టలకు కూడా రైతుబంధు ఇచ్చిందన్నారు. దానివల్ల 25 వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి తప్పు జరగదని ఈసారి పంటలు సాగు చేసిన రైతులకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. అదేవిధంగా 31 వేల కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు.
LATEST UPDATE :
Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!
Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!
TG News : తెలంగాణలో రెండో రోజు రాజకీయ రచ్చ.. నేతల మధ్య మాటల యుద్ధం..!
Harish Rao : కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ వ్యవహారంపై హరీష్ రావు కీలక ట్వీట్..!










