Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రమాదకరంగా ప్రధాన రహదారి..!
ప్రమాదకరంగా ప్రధాన రహదారి..!
దమ్మపేట , మన సాక్షి :
భద్రాద్రికొత్తగూడెం జిల్లా దమ్మపేట జయలక్ష్మి థియేటర్ దగ్గర దమ్మపేట టు పాల్వంచ ప్రధాన రహదారిపై పెద్ద పెద్ద గోతులు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా కొన్ని చోట్ల చాలా ప్రమాదకరంగా మారిన రహదారి వాహన దారులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపై పెద్దగోతులు దర్శనమిస్తున్నా రోడ్ల భవనాలు శాఖ అధికారులు గోతులు పూడ్చకుండా గాలికి వదిలేయడంతో వాహన దారులు గోతుల్లోపడితీవ్ర గాయల పాలై ఆసుపత్రికి పరిమితమవుతున్నారు. రోడ్ల భవనాల శాఖ అధికారులను గోతులు పూడ్చమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల భవనాల శాఖ అధికారులు వెంటనే ప్రధాన రహదారిపై ఉన్న గోతులు పూడ్చి ప్రమాదాలు జరగకుండా నివారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :









