Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!

TG News : తెలంగాణ పేదలకు గుడ్ న్యూస్.. వారికి అక్టోబర్ లో ఇందిరమ్మ గృహాలు.. మంత్రి కోమటిరెడ్డి వెల్లడి..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణ పేద ప్రజలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.  నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణం బైపాస్ వద్ద 180 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు వెహికల్ అండర్ పాస్ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అక్టోబర్ నుండి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులతో పాటు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నామని తెలిపారు. విధి విధానాలు త్వరలో వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ గృహాలకు స్థలం ఉన్న వారికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు రాష్ట్రప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నదని తెలిపారు.

ఇందులో భాగంగా ఇప్పటివరకు 85 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ను ఇస్తున్నామని, 200 యూనిట్లలోపు వారికి జీరో బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు.

6 నెలల్లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్
ద్వారా రెండు యూనిట్ల నుండి విద్యుత్ ఇవ్వనున్నామని, ఎస్ఎల్బీసీ సొరంగాన్ని రెండు సంవత్సరాలలో పూర్తి చేసి నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు. సాగునీటితో పాటు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా డబుల్ రోడ్ల నిర్మాణం ,ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే తమ ధ్యేయమని ఆయన తెలిపారు.

ఇటీవల పార్లమెంట్ సభ్యులు రఘువీర్ అమృత్ పథకం కింద 316 కోట్ల రూపాయలను తీసుకురావడం జరిగిందని, దీనిద్వారా తాగునీటి ట్యాంకులతోపాటు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. గతంలోనే మిర్యాలగూడ నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలని తీసుకురావడం జరిగిందని , ప్రస్తుతం 10 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను మంజూరు చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.

సమావేశానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, అధ్యక్షత వహించగా నలగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర రెడ్డి, డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. ఈఎన్ సీ మధుసూదన్ రెడ్డి, క్యూబ్ హైవేస్ చైర్మన్ హరికృష్ణ రెడ్డి , మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్ అండ్ బి ఎస్ ఈ సత్యనారాయణ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

LATEST UPDATE : 

TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!

Miryalaguda : మిర్యాలగూడలో రూ.180 కోట్లతో నాలుగు అండర్ పాస్ ల నిర్మాణం.. భూమి పూజ చేసిన కోమటిరెడ్డి..!

Komatireddy : తెలంగాణ రాష్ట్ర ఘనత అమరులదే.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..!

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

మరిన్ని వార్తలు