Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsహైదరాబాద్

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..! 

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేదలకు సన్నబియ్యం అందజేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు.

తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. త్వరలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

సోమవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు అనేక విషయాలు వెల్లడించారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు మంజూరుకు విధివిధానాలను త్వరలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ తో పాటు ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా కార్డులు మంజూరు చేశారో అధ్యయనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో కూడా అదే విధంగా విధి విధానాలను రూపొందించనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 30.50 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లు తెలిపారు. వీళ్ళందరికీ కూడా ఆరు కిలోల బియ్యం ఉచితంగా అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా పేదలందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు పై 2025 జనవరి మాసం నుంచి సన్న బియ్యం అందజేయనున్నట్లు తెలిపారు.

ఈనెల 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానున్నదని, ఆ సమావేశంలో తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు విధివిధానాలను రూపొందించి వెల్లడిస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డులతో పాటు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు.

LATEST UPDATE : 

Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

మరిన్ని వార్తలు