Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!
Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ ఈనెల 20వ తేదీన సమావేశం కానున్నది. సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. ముఖ్యంగా రైతుల రుణమాఫీ అంశంపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
రుణమాఫీ కానీ రైతుల కు ఈ నెల ఆఖరి వరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు కేబినెట్ లో చర్చించి రైతుల రుణమాఫీ చేయనున్నారు. రెండు లక్షల రూపాయల పైగా రుణాలు ఉన్న రైతులు వడ్డీని బ్యాంకులో చెల్లిస్తే వారికి మాఫీ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకుగాను కట్ ఆఫ్ తేదీని నిర్ణయించనున్నారు.
అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని కూడా అక్టోబర్ మాసంలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం తీసుకొచ్చి ఎకరానికి 15000 పెట్టుబడి సహాయం అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.
కాగా ఇప్పటివరకు రైతు భరోసాను ప్రారంభించలేదు. వానకాలం సీజన్ కూడా సగం గడిచింది. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకుగాను అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి రోజు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అక్టోబర్ మాసం పూర్తయ్యలోగా అందరికీ రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించే అవకాశాలున్నాయి.
అదేవిధంగా రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ప్రజాపాలన దరఖాస్తులలో భాగంగా రేషన్ కార్డులు కావాలని ఎంతోమంది నుంచి దరఖాస్తులు వచ్చాయి.
రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు. పేరు మార్పిడి, కొత్తగా కుటుంబ సభ్యుల చేర్పులను మీ సేవ కేంద్రాలలో చేస్తున్నారు. కానీ కొత్తగా రేషన్ కార్డులను ఇవ్వడానికి వీధి విధానాలను వెల్లడించనున్నారు. ఈసారి రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులుగా ఇచ్చే అవకాశాలున్నట్లు గతంలోనే ప్రభుత్వం తెలియజేసింది.
రేషన్ కార్డు తో పాటు ఆరోగ్యశ్రీ కార్డు కూడా అందజేసే అంశంపై కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా హైడ్రా విధి విధానాలను రూపొందించనున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే అంశంపై క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి :
Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!
Nelakondapally : రైతులకు రూ.10వేల సహాయం.. మంత్రి పొంగులేటి వెల్లడి..!
Batti Vikramarka : రైతు రుణమాఫీ పై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం..!
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 6000 ఉద్యోగాలు భర్తీ..!









