Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవ్యవసాయం

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి :

రైతుల రుణమాఫీ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆదివారం పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందిరమ్మ రాజ్యంలో వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించినట్లు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామన్నారు. వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామన్నారు.

6 గ్యారంటీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల ముందు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పామని.. అది చేసి చూపించామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంచినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ రెండు పర్యాయాలు కాంగ్రెస్ కు అధికారం దక్కలేదని, కొన్ని వేరువేరు కారణాలవల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రెండు పర్యాయాలు రాలేకపోయింది అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా తాను 38 నెలల ప్రజల తరఫున పోరాటం చేసినట్లు పేర్కొన్నారు.

రెండు లక్షల రూపాయలకు పైగా ఋణం ఉన్నవారు వడ్డీ చెల్లిస్తే మాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేశామని, కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం తప్పక జరుగు తీరుతుందని నిరూపించామన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : 

మరిన్ని వార్తలు