TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
TG News : తెలంగాణలో నూతన విద్యా విధానం.. 2025 నుంచి ఇంటర్ ఉండదు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
దేశంలోని మెజార్టీ రాష్ట్రాలు నూతన విద్యా విధానం అమలు అమలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే నూతన విద్యా విధానం అమలు చేయడం లేదు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నది.
నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. నూతన విద్యా విధానం ద్వారా ఇంటర్మీడియట్ ను తీసివేయనున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 5 + 2 + 3 + 2 విద్యా విధానం అమల్లో ఉంది. కాగా వచ్చే ఏడాది 2025 లో నూతన విద్యా విధానాన్ని అమలు చేయనున్నారు.
నూతన విద్యా విధానం ప్రకారం 5+3+3+4 విద్యా విధానం అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఐదవ తరగతి వరకు ప్రీ ప్రైమరీ, ఎనిమిదవ తరగతి వరకు అప్పర్ ప్రైమరీ, 9వ తరగతి నుంచి సెకండరీ విద్యా విధానం అమలు చేయనున్నారు.
మొదటి ఐదు సంవత్సరాలు అంగన్వాడి ప్రీ స్కూల్ మూడేళ్లు, ఒకటి,రెండు తరగతులు ఉంటాయి. ఆ తర్వాత మూడేళ్లు 3,4,5 తరగతులు ఉంటాయి. మరో మూడేళ్లు 6,7,8 తరగతులు ఉంటాయి. చివరి నాలుగేళ్లు 9 ,10 11 ,12 తరగతులు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం ద్వారా ఇంటర్మీడియట్ ప్రత్యేకంగా ఉండదు. ప్రస్తుతం తెలంగాణలో స్కూల్ , ఇంటర్ విద్యా విధానం వేరువేరుగా ఉన్నాయి. కానీ నూతన విద్యా విధానంతో ఇంటర్మీడియట్ వేరుగా ఉండదు.
నూతన విద్యా విధానం ద్వారా సర్కార్ పై అదనపు భారం తగ్గడంతో పాటు డ్రాప్స్ కూడా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. వచ్చే ఏడాది నుంచి ఈ విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
LATEST UPDATE :
Ration Cards : పేదలకు ఇక సన్న బియ్యం.. ప్రభుత్వ నిర్ణయం, ఎప్పటి నుంచి అంటే..!
Komatireddy : రూ. 2000 కోట్లతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్లుగా విస్తరణ..!
Ration Cards : కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. విధి విధానాలు.. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం..!
తెలంగాణలో మొట్టమొదటి కంటెయినర్ స్కూల్.. ప్రారంభానికి సిద్ధం..!









