Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsజిల్లా వార్తలుములుగు జిల్లావిద్య

తెలంగాణలో మొట్టమొదటి కంటెయినర్ స్కూల్.. ప్రారంభానికి సిద్ధం..!

తెలంగాణలో మొట్టమొదటి కంటెయినర్ స్కూల్.. ప్రారంభానికి సిద్ధం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

కంటెయినర్ దుకాణాలు, ఇల్లులు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కానీ ఏకంగా ప్రభుత్వ పాఠశాలనే నిర్మించడం మొట్ట మొదటిసారి.

తెలంగాణ రాష్ట్రంలో ఇదే మొట్ట మొదటి కంటైనర్ స్కూల్. తెలంగాణలోని ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో బంగారుపల్లి గొత్తి కోయలగుంపు గ్రామంలో ఈ కంటెయినర్ పాఠశాల నిర్మిస్తున్నారు. ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడ ఈ పాఠశాల నిర్మించడానికి ఓ కథ ఉంది అదేంటంటే..

ఆ గ్రామం అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు అటవీశాఖ అనుమతులు ఇవ్వదు. దాంతో ఆ గ్రామంలోని పిల్లలు ఎలాంటి సౌకర్యం లేని గుడిసెలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. అక్కడ ఒక ఉపాధ్యాయుడు, ఒక ఉపాధ్యాయురాలు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీశాఖ అనుమతులు ఇవ్వలేదు.

దాంతో ఆ జిల్లా కలెక్టర్ దివాకర్ కు వినూత్న ఆలోచన తట్టింది. కంటెయినర్ (ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్) పాఠశాలను ఏర్పాటు చేయాలని భావించారు. దాంతో జిల్లా కలెక్టర్ 13 లక్షల రూపాయల నిధులతో ఈ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణాలు కూడా పూర్తి కావచ్చాయి.

ఇది పూర్తిగా కంటెయినర్ పాఠశాల. 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుంది. అందులో 12 డ్యూయల్ డెస్క్ లతో పాటు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కూర్చోవడానికి మూడు కుర్చీలు పట్టే స్థలం ఉంటుంది. నిర్మాణం పూర్తిస్థాయి కావచ్చునందున మరో వారం రోజుల్లో మంత్రి సీతక్క ఈ పాఠశాలలో ప్రారంభించనున్నారు.

LATEST UPDATE : 

Rythu Barosa : 20న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై నిర్ణయం.. రైతు భరోసా ప్రారంభం అప్పుడే..!

సెప్టెంబర్ 17న ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనబోతుందా.. కలవర పడుతున్న మానవాళి..!

Cm Revanth : రుణమాఫీ పై సీఎం రేవంత్ సంచలన ప్రకటన..!

మరిన్ని వార్తలు