Uttam Kumar Reddy : పింఛన్లు, రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!
Uttam Kumar Reddy : పింఛన్లు, రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు, పింఛన్ దారులకు శుభవార్త తెలియజేసింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ వెల్లడించారు. వచ్చే నెల నుంచి కొత్తగా డిజిటల్ కార్డులు జారీ చేయనున్నారు. ఈ డిజిటల్ కార్డు ద్వారా కార్డుదారులు ఎప్పుడైనా, ఎక్కడైనా బియ్యం నిత్యవసర సరుకులు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ కార్డు ద్వారానే పింఛను కూడా పొందవచ్చును.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది వలస కూలీలు జీవనోపాధి కోసం ముంబై, ఇతర ప్రాంతాలకు వెళ్తారు. వారు తిరిగి స్వగ్రామానికి వచ్చి పింఛన్, రేషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. అలాంటివారు ఎక్కడైనా, ఎప్పుడైనా పింఛన్, రేషన్ పొందే విధంగా అవకాశం కల్పించనున్నారు. ఈ విషయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు.
అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి చేసేందుకు ₹4,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది అన్నారు. పాలమూరు రంగారెడ్డి తో పాటు ఇతర పెండింగ్ పూర్తి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.









