Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణపెద్దపల్లి జిల్లావిద్య

Applications : ఐటిఐ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

Applications : ఐటిఐ లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం..!

పెద్దపల్లి, మన సాక్షి :

పెద్దపల్లి జిల్లా లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ, పెద్దపల్లి నందు ఆగష్టు 2024-25 వ విధ్యా సంవత్సరం మిగిలి ఉన్న సీట్ల కొరకు వాక్ ఇన్ ప్రవేశాలకు దరఖాస్తులు తేదీ 28-09-2024 ఉదయం 11.00 వరకు అభ్యర్థులు ఆన్ లైన్ లో వెబ్ సైట్ ( iti.telangana.gov.in) నందు దరఖాస్తు చేసుకోగలరు.

ముందు విడతలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్స్ ఎంచుకొని నేరుగా ఒరిజినల్ సెర్టిఫికేట్లతో హాజరు కాగలరు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ మరియు ఒరిజినల్ సెర్టిఫికేట్లతో తేదీ 25-09-2024 నుండి 28-09-2024 వరకు ప్రతి రోజున 11.00 గంటల లోపు ప్రభుత్వ ఐ.టి. ఐ. పెద్దపల్లి నందు హాజరుకాగలరు.

కావున ఇట్టి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరుచుకోవాలని పెద్దపల్లి ప్రభుత్వ ఐ.టి.ఐ ప్రిన్సిపల్ శ్రీ బుసిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తెలియపరిచినారు.

గమనిక : ప్రతి రోజు సీట్ల వేకన్సీని బట్టి తదుపరి రోజు వాక్ ఇన్ ప్రవేశాలు జరుగుతాయి.

ఇవి కూడా చదవండి :

మరిన్ని వార్తలు