Indiramma Gruhalu : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. వారం రోజుల్లో ఇందిరమ్మ గృహాలు, విధి విధానాలు..!
Indiramma Gruhalu : తెలంగాణలో పేదలకు మరో శుభవార్త.. వారం రోజుల్లో ఇందిరమ్మ గృహాలు, విధి విధానాలు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పేద ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలియజేసింది. పేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇందిరమ్మ గృహాల నిర్మాణంపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుభవార్త తెలియజేశారు. పేదలకు దసరా పండుగ కానుకగా ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తోంది.
గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తామని చెప్పిన పది సంవత్సరాల పాటు కూడా సాధ్యపడలేదు. కొన్నిచోట్ల డబుల్ బెడ్ రూమ్ గృహాలు నిర్మించినప్పటికీ సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రారంభానికి కూడా నోచుకోలేదు. కొన్నిచోట్ల మాత్రమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించి పంపిణీ చేశారు.
కాగా ఎన్నికల సమయంలో ఇందిరమ్మ గృహాలను తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కాగా హామీ మేరకు ఇందిరమ్మ గృహాలను మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం
చర్యలు చేపట్టింది. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరో వారం రోజుల్లో విధి విధానాలను రూపొందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తో కలిసి సోమవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అర్హులకు అందించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, అక్టోబర్ 2వ తేదీ నుంచి అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ ప్రక్రియ చేపడతామని పేర్కొన్నారు.
అదేవిధంగా ఇందిరమ్మ గృహాల ఎంపికకు విధివిధానాలను వారం రోజుల్లో రూపొందిస్తామని, అక్టోబర్ 15వ తేదీ నుంచి లబ్ధిదారుల ఎంపిక చేపడుతామన్నారు. ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు సహాయం చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
మొదటి విడతగా ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలను సహాయం చేయనున్నారు. ఆ తర్వాత రెండో విడతలో ఇంటి స్థలం లేని పేదలను గుర్తించి వారికి ఇంటి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయల సహాయం చేయనున్నారు. కాగా మరో వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక విధానాలను రూపొందిస్తే దసరా పండుగ నుంచి ఇందిరమ్మ గృహాల పథకాన్ని ప్రారంభించనున్నారు.
LATEST UPDATE :
-
Ponguleti SrinivasReddy : రైతులకు గుడ్ న్యూస్.. వారందరికీ సహాయం, మంత్రి పొంగులేటి వెల్లడి..!
-
Miryalaguda : మిర్యాలగూడలో కోడి పందాలు.. ఇద్దరు అరెస్ట్, ఏడుగురు పరార్..!
-
Miryalaguda : ప్రభుత్వ ఆసుపత్రిలో కిటకిటలాడిన రోగులు.. ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ..!
-
Uttam Kumar Reddy : పింఛన్లు, రేషన్ కార్డుదారులకు భారీ గుడ్ న్యూస్.. వచ్చే నెల నుంచి..!









