క్రైంBreaking Newsజిల్లా వార్తలుమహబూబాబాద్ జిల్లా

నకిలీ నక్సల్ హల్చల్.. తుపాకీతో బెదిరించి 35 వేలు వసూలు..!

నకిలీ నక్సల్ హల్చల్.. తుపాకీతో బెదిరించి 35 వేలు వసూలు..!

మహబూబాబాద్, మన సాక్షీ :

మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో నకిలీ నక్సల్స్ హల్చల్ సృష్టించారు. బైక్ నుంచి జారి పడ్డామని, వైద్యం కోసం ఆర్ఎంపి అడ్రస్ చెప్పమని, కొన్ని మంచినీళ్లు ఇవ్వండి అంటూ గ్రామానికి చెందిన సుధాగని వెంకటయ్యను శుక్రవారం అర్థరాత్రి నమ్మించి ఇంట్లోకి చొరబడ్డారు.

నక్సలైట్లమని బెదిరించి ఎవరికైనా చెప్తే చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించి 35 వేల రూపాయలను వసూలు చేశారని బాధితుడు వెంకటయ్య తెలిపాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఝాన్సీ తెలిపారు. అలాగే అపరిచిత వ్యక్తులు అనుమానస్పదంగా కనపడితే మాకు తెలియపరచాలని, లేదంటే 100కి డయల్ చేయాలని సూచించారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు